HomeతెలంగాణMURDER; పెండ్లికి నిరాకరించిందని.. ప్రియురాలి హత్య

MURDER; పెండ్లికి నిరాకరించిందని.. ప్రియురాలి హత్య


MURDER:ఐదేండ్ల పాటు ప్రేమించుకొని చివరికి ప్రియురాలు పెండ్లికి నిరాకరించిందని ప్రియుడు ప్రియు రాలిని చున్నితో గొంతునులిమి హత మా ర్చిన ఘటన వనపర్తి జిల్లా ఘనపురం మండలంలోని మానాజీపేట గ్రామంలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాచాజీపేట గ్రామానికి చెందిన శ్రీశై లం హైదరాబాద్లోని కాటేదాన్ కు చెం దిన సాయిప్రియ (19)లు ఒకే కళాశాలలో చదువుతున్నారు. వారి పరిచయం ప్రేమగా మారి పెండ్లి వరకు వచ్చింది. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న సాయిప్రియ తల్లి దండ్రులు శ్రీశైలంను మందలించారు. దీంతో శ్రీశైలం గ్రామానికి వచ్చి బర్రెలు తెచ్చు కొని జీవనం సాగిస్తున్నాడు.
సాయిప్రియ గ్రామంలో ఉంటున్న ప్రియుడు శ్రీశైలం స్వగ్రామానికి రెండు సార్లు వచ్చి వెళ్లింది. ఈనెల 5న గ్రామానికి వస్తుందనే సమాచారం తెలుసుకున్న ప్రి యుడు శ్రీశైలం భూత్పూర్ కు వెళ్లి మానాజీపేట గ్రామ సమీపంలోని కేఎల్ కా లువ దగ్గరికి మధ్యాహ్నం సమయంలో వెళ్లారు. మాటమాటా అనుకొని సాయిప్రియ నన్ను మరిచిపో… నేను మా తల్లిదండ్రు లు చెప్పిన అబ్బాయిని పెండ్లిచేసుకుంటా ఈ వి షయం చెప్పి వెళ్లామని వచ్చా.. అని శ్రీశై లంతో గట్టిగా చెప్పింది. దీంతో శ్రీశైలంలో కోపం కట్టలు తెంచుకున్నది. నేను త్వరగా హైదరాబాద్ వెళ్తాను మా అమ్మనాన్న నా కోసం ఎదురుచూస్తారని చెప్పడంతో కోపం తో ఉన్న శ్రీశైలం సాయిప్రియ మెడలోని చున్నితో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.
పక్కనే ఉన్న ముండ్ల పొదలో సాయిప్రియ మృతదేహాన్ని తోసి బర్రెల కొట్టం దగ్గరికి వెళ్లి రోజు మాదిరిగానే పాలు పిండి తన దిన చర్యను ముగించుకున్నాడు. సాయిప్రియ మృతదేహాన్ని ఏంచేయాలని ఆలోచనతో సమీపంలో ఉన్న బావమరిది శివకు విష యం చెప్పాడు. విషయం తెలుసుకున్న శివ మొదటగా నిరాకరించినా శ్రీశైలం పట్టుబట్టడంతో ఆటోలో పార, గడ్డపార, గంప త దితర సామగ్రితో అక్కడికి చేరుకొని సాయి ప్రియ మృతదేహాన్ని రాత్రి 11 గంటల న మయంలో కాలువ పక్కన గుంట తీసి పూడ్చివేసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. పోతుపోతూ సాయిప్రియ సెల్ ఫోన్ కాలువలో విసిరివేశారు. సోమ వారం రాత్రి అయినా కూతురు రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img