LAPTOPS::
దేశంలో తయారయ్యే సెమీకండక్టర్లు.. ల్యాప్‌టాప్‌ల ధరను భారీగా తగ్గిస్తాయి. ఈ విషయాన్ని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు.భారత్‌లోనే గ్లాస్, సెమీకండక్టర్లు తయారైతే ప్రస్తుతం మార్కెట్‌లో లక్ష రూపాయలున్న ల్యాప్‌టాప్‌ను రూ.40 వేలకే లభిస్తాయని అన్నారు.
ప్రస్తుతం తైవాన్, కొరియాల్లో ఉత్పత్తి అవుతున్న గ్లాస్.. అతి త్వరలోనే భారత్‌లోనూ తయారవుతుంది’ అంటూ ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ అగర్వాల్ తెలిపారు. ఫాక్స్‌కాన్‌తో కలిసి వేదాంత సెమీకండక్టర్ల ప్లాంట్ పెడుతున్న నేపథ్యంలో దేశీయంగా ల్యాప్‌టాప్‌లతోపాటు మొబైల్ ఫోన్లు, ఈవీలనూ తయారు చేస్తామని వెల్లడించారు. వచ్చే రెండేండ్లలో ఉత్పత్తికి ఈ ప్లాంట్ సిద్ధమవుతుందన్న తెలిపారు యాపిల్ ఫోన్ల తయారీలో ఫాక్స్‌కాన్ టెక్నాలజీనే కీలకమన్న విషయం. మనకు తెలిసిందే