KTR:బంధువుల పార్టీ కాదు…మీదే భారత రాబందుల పార్టీ అని ట్విట్టర్ లో కేటీఆర్ ఏకిపారేసాడు.
ఏఐసీసీ అంటేనే…అఖిల భారత కరgప్షన్ కమిటీ All India Corruption కమిటీ అన్నారు.దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అని విమర్శించారు.స్కాములే తాచుపాములై మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదన్నారు కేటీఆర్.మా పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదు..కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదన్నారు.
బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ…ఒంటిచేత్తో ఢీకొట్టే.. ఢీ టీమ్.. బీఆర్ఎస్ అని అన్నారు.బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా ?. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది.. కాంగ్రెస్సే నని జోష్యం చెప్పారు.లక్ష కోట్లు వ్యయం కానికాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా ? అర్థంలేని ఆరోపణలు చేసి..ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది.నిర్మాణాత్మక ప్రతిపక్షం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా
తెలియని ప్రతిపక్షం కాదన్నారు.భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని ఏద్దేవా చేశారు.కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపి..ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు ? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇ క్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు ? కర్ణాటకలో బీజేపీని ఓడించింది.అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదని అన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు – సమర్థత అంతకన్నా కాదని పేర్కొన్నారు
సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..??
కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోండి..4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు.నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన
దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు.మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు మా పాలనలో మన్యానికి మంచిరోజులు వచ్చాయన్నారు.బీఆర్ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు ? జాతీయ రాజకీయాలు.. మీ జాగీరా.. ??అని ప్రశ్నించారు.