KTR:సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం కృషిచేసిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రామ్ అని మంత్రులు కేటీఆర్ ,కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీ కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. జగ్జీవన్ రామ్ జీవితమే ఒక స్పూర్తి దాయకం మన్నారు..వారి స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన సాగుతున్నదని మంత్రులు చెప్పు కోచ్చారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పర్యటించారు. వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ ఆవిష్కరించారు. బాబు జాగ్జీవన్ రాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులుప్రసంగించారు .పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.
దళితుల బాగుకోసం దేశంలో ఎవరూ చేయలేని విధంగా సీఎం కేసీఆర్ గారు దళితుల ఆత్మబంధువుగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.గత 50 ఏళ్ళ ప్రభుత్వాల పాలనలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దళితబంధు పథకానికి రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు కేటాయించారని.. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని ప్రయోజనం చేకూరుతుందని, నియోజకవర్గానికి 1100 మందికి లబ్దిపొందుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న పధకాలతో దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నదని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1614 మంది పోడు రైతులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి కేటీఆర్ భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు.