samantha: ఇదేనిజం, సినిమా: నటి సమంత ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తోంది. ఇండోనేషియాలోని బాలి ప్రదేశానికి వెళ్లిన ఆమె అక్కడి ప్రతి దృశ్యాన్ని అభిమానులతో పంచుకుంటోంది. ఇక ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడి పోస్ట్‌లను లైక్‌లు, కామెంట్లతో నింపేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో సరదాగా తిరుగుతోన్న ఫొటోలను పోస్ట్ చేసిన సమంత.. ఎంతో ఆనందంగా ఉంది అంటూ కాప్షన్ రాసింది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.