- వరద బాధితులను చూస్తుంటే బాధేస్తోంది..
- గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
ఇదేనిజం, స్టేట్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు తిప్పి పంపడం తన ఉద్దేశ్యం కాదని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. బిల్లులు ఎందుకు రిజెక్ట్ చేశానో.. దానికి కారణాలు కూడా వివరించానన్నారు. వరద బాధితులను చూస్తుంటే తనకు బాధ కలుగుతోందని చెప్పారు. ష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అండగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు తనకు మెమొరాండం ఇచ్చాయని గవర్నర్ చెప్పారు. నీట మునిగిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.