Homeఫ్లాష్ ఫ్లాష్vishal:విశాల్​ పెళ్లిపై మళ్లీ రూమర్స్​

vishal:విశాల్​ పెళ్లిపై మళ్లీ రూమర్స్​

ఆ హీరోయిన్​ తో డేటింగ్​ చేస్తున్నాడంటూ పుకార్లు

తమిళ హీరో విశాల్​ పెళ్లి, ప్రేమపై నిత్యం ఏదో ఓ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా లక్ష్మీ మీనన్​ తో విశాల్​ పెళ్లి జరగబోతోందని పుకార్లు ఊపందుకున్నాయి. లక్ష్మీ మీనన్​ తో విశాల్​ డేటింగ్​ లో ఉన్నాడని కూడా కొన్ని వెబ్​ సైట్లు రాసుకొచ్చాయి. దీనిపై విశాల్​ డైరెక్ట్​ గా స్పందించాడు.
‘‘నాపై వచ్చే రూమర్స్‌, ఫేక్‌ న్యూస్‌ల గురించి నేను పెద్దగా స్పందించను. గత కొన్ని రోజులుగా లక్ష్మీ మేనన్‌తో నా వివాహం జరుగనుందనే వార్తలు వైరలవుతున్నాయి. ఇవి పూర్తిగా నిరాధారమైనవి. వీటిని నేను ఖండిస్తున్నాను. ఆమె నటి కంటే ముందు ఒక అమ్మాయి. అందుకే నేను ఈ రూమర్స్‌పై స్పందిస్తున్నాను. ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని అనవసరంగా వార్తల్లోకి లాగొద్దు. ఇలాంటి వార్తల వల్ల ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లి గురించి నేనే అధికారికంగా ప్రకటిస్తాను’’ అని విశాల్‌ ట్వీట్‌ చేశారు. ఇక విశాల్‌, లక్ష్మిమేనన్‌ గతంలో పల్నాడు, ఇంద్రుడు సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరిపై రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా విశాల్ ట్వీట్‌తో వాటికి చెక్‌ పడినట్లైంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశాల్‌ మూడు సినిమాల్లో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img