Homeఆంధ్రప్రదేశ్Former DGP's son: వివాదంలో మాజీ డీజీపీ కుమారుడు

Former DGP’s son: వివాదంలో మాజీ డీజీపీ కుమారుడు

– యువతి కోసం గొడవ?
– జూబ్లీహిల్స్​లోని ఓ పబ్​ ఎదుట ఘటన

Former DGP’s son: ఇదేనిజం, హైదరాబాద్​: ఏపీ మాజీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ కుమారుడు డేవిడ్​ సవాంగ్​ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతి కోసం జరిగిన గొడవలో డేవిడ్​ సవాంగ్ గాయపడ్డట్టు​ సమాచారం. గురువారం తెల్లవారుజామున జూబ్లిహిల్స్​ రోడ్డు నంబర్​ 10లోని ఓ పబ్​ ఎదుట రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఓ యువతి కోసమే ఇక్కడ గొడవ జరిగినట్టు సమాచారం. అయితే ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ ఉండగా.. మరో వర్గంలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు సమాచారం. పబ్‌లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొనే లోపు ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అయితే ఈ గొడవపై తమకు ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్​ పోలీసులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img