HomeతెలంగాణKhairatabad Ganesh nimajjanam complete గంగమ్మ ఒడికి మహా గణపతి

Khairatabad Ganesh nimajjanam complete గంగమ్మ ఒడికి మహా గణపతి

– మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం
– కనుల పండువగా శోభాయాత్ర
– గల్లీ గల్లీ నుంచి నిమజ్జనానికి తరలిన గణనాథులు

ఇదే నిజం, హైదరాబాద్: గ్రేటర్​ హైదరాబాద్​లో గణనాథుల శోభాయత్ర, నిమజ్జన కోలాహలం మొదలైంది. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ సిటీలో ప్రతి గల్లీ నుంచి గణనాథులను మండపాల నిర్వాహకులు హుసేన్​సాగర్​కు తరలించారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ‘జై బోలో గణేశ్​ మహరాజ్​ కీ.. జై’నినాదాలతో పరిస ప్రాంతాలు మార్మోగాయి. 6 గంటల పాటు కొనసాగిన ఖైరతాబాద్ బడా గణేశ్​ శోభాయాత్ర టెలిఫోన్​ భవన్​, సెక్రటేరియట్​, ఎన్టీఆర్ మార్గ్​ మీదుగా ట్యాంక్​బండ్​పై ఉన్న క్రేన్​ నంబర్ 4కు చేరుకుంది.

అంతకుముందు సెక్రటేరియట్​ ముందు యువత ఆటపాటలతో హంగామా చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు క్రేన్​ నం.4 వద్ద మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. బడా గణేశ్​ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన వారితో ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు లడ్డూ వేలం అనంతరం ఉదయం 11.30 గంటలకు బాలాపూర్​ గణనాథుని శోభాయాత్ర మొదలైంది. చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఫలక్​నుమా, చార్మినార్, మొజంజాహి మార్కెట్​ మీదుగా బాలాపూర్ గణనాథుడు హుస్సేన్​సాగర్​కు చేరుకోనున్నాడు. నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్‌- హుస్సేన్‌సాగర్‌ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ సీపీ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

Recent

- Advertisment -spot_img