HomeతెలంగాణMinister KTR complained that the Congress party is not giving up its...

Minister KTR complained that the Congress party is not giving up its old habits : పాత అలవాట్లు ఎక్కడికి పోతాయి​

– కర్ణాటకలో కాంగ్రెస్ అవినీతి స్టార్ట్​
– ఐటీ మంత్రి కేటీఆర్​

ఇదేనిజం, హైదరాబాద్​: కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాట్లను వదిలేయడం లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన అవినీతిని మొదలుపెట్టిందని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ రాజకీయ ఎన్నికల పన్నువిధించడం ప్రారంభించిందని ఈ మేరకు కేటీఆర్ ట్వీట్​ చేశారు. బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500ల చొప్పున పన్ను విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిధుల సేకరణ చేస్తుందన్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కామ్‌ల వారసత్వంతో స్కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరన్నారు.

Recent

- Advertisment -spot_img