ఇదేనిజం, పాలకుర్తి: మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. పాలకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ సమర్పించారు. అంతకుముందు ఆయన సోమేశ్వర లక్ష్మినరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యర్తలు, అభిమానులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు 1994 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1994లో తొలిసారి వర్ధన్నపేట నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999, 2004లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది.