చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన క్రికెటర్ బయోపిక్ మూవీ ‘800’. శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రపై మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఎం ఎస్ శ్రీపతి ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా తమిళ్ భాషల్లో అయితే రిలీజ్‌కు తీసుకొచ్చారు. అయితే, ఈ మూవీ అనుకున్న రేంజ్ రెస్పాన్స్‌ను థియేటర్స్‌లో అందుకోలేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు ఫిక్స్ అయ్యింది. మరి, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమాస్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2న జియో సినిమాస్ యాప్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందులో ఈ మూవీ ఉచితంగా చూడొచ్చని తెలిపారు.