టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్నసినిమా కావడంతో ఆడియెన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌పై ఒక అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబందించి అమెరికా షెడ్యూల్ పూర్తయ్యింది. అయితే, తొందరలో హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఒక వారం లేదా పది రోజుల్లో ఈ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మృణాల్ ఠాకూర్, దివ్యాంశ్ కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.