Homeసినిమా‘ఫ్యామిలీ స్టార్’ యూఎస్ షెడ్యూల్ కంప్లీట్

‘ఫ్యామిలీ స్టార్’ యూఎస్ షెడ్యూల్ కంప్లీట్

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం మూవీ తర్వాత వీరి కాంబినేషన్​లో వస్తున్నసినిమా కావడంతో ఆడియెన్స్​లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్​పై ఒక అప్​డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబందించి అమెరికా షెడ్యూల్ పూర్తయ్యింది. అయితే, తొందరలో హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఒక వారం లేదా పది రోజుల్లో ఈ షెడ్యూల్​పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మృణాల్ ఠాకూర్, దివ్యాంశ్ కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img