చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారులు దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో మాంజా విచ్చలవిడిగా లభిస్తోంది. తక్కువధరకే లభ్యం కావడంతో.. గాలిపటానికి కట్టిన మాంజా తెగిపోదు. నైలాన్ దారం, గాజుముక్కల పొడితో కలిపి దాన్ని తయారుచేయడం వల్ల చాలా మృదువుగా తెగకుండా ఉంటుంది. ప్రమాదమని తెలిసినా.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ మాంజా కొనిపెడుతున్నారు. చైనా మాంజాతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.