ఎండపల్లి, ఇదే నిజం: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల ఎంపీటీసీ బషీర్ భాయ్ తల్లి వొజ్రబి (65) పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎండవల్లకి వచ్చి బషీర్ బాయ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వొజ్రబి ఆత్మకు శాంతి చేకూరాలని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బషీర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.