Homeహైదరాబాద్latest Newsఇండ్ల ముందు దీపాలు పెట్టకపోతే ఉగ్రవాదులమా.. నోరు పారేసుకున్న టాప్ డైరెక్టర్

ఇండ్ల ముందు దీపాలు పెట్టకపోతే ఉగ్రవాదులమా.. నోరు పారేసుకున్న టాప్ డైరెక్టర్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా. రంజిత్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి కబాలి, కాలా చిత్రాల్లో పనిచేశారు. ఈ రెండు మూవీల్లో రజనీ పాత్రను అద్భుతంగా చూపించి రంజిత్.. ఫ్యాన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. కబాలి, కాలాలో తలైవాను యువతరానికి కనెక్ట్ అయ్యేలా చూపించారు రంజిత్. సౌత్ సూపర్‌ స్టార్‌గా కోట్లాది మంది ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న రజనీకాంత్.. కొన్ని నెలల క్రితం రాజకీయాల్లోంచి తప్పుకున్నారు. తనకు పాలిటిక్స్ సరిపడవని డిసైడ్ అయ్యారు. అందుకే హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ ఆయన కేంద్రంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. అందుకే ఆయనకు అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వనం అందింది. అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠను ఎందరో సినీ నటులు, క్రీడా ప్రముఖులు కనులారా వీక్షించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు రజనీ కాంత్ కూడా అయోధ్యకు వెళ్లారు. శ్రీరాముడిని దర్శనం చేసుకున్నారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవం చరిత్రాత్మకమని, 500 ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైందని రజనీ ఇటీవలే తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ రంజిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమానికి హాజరైన రంజిత్ ను.. రజనీ అయోధ్యకు వెళ్లడంపై అభిప్రాయం ఏంటని ప్రశ్నించింది. దీనికి ఆయన.. అయోధ్యకు రజనీ వెళ్లడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అది ఆయన వ్యక్తిగతమని బదులిచ్చారు. కానీ 500 ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైందని రజనీ చేసిన ప్రకటనపై తనకు అభ్యంతరం ఉందని రంజిత్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో తిరోగమన రాజకీయాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటూ రంజిత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల ముందు దీపాలు వెలిగించకపోతే ఉగ్రవాదులుగా పరిగణిస్తున్న యుగంలో మనం జీవిస్తున్నామని ఆరోపించారు. అయితే అయోధ్య రామమందిరం విషయంలో రజనీ అభిప్రాయాలపై రంజిత్ చేసి కామెంట్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. దీనిపై రజనీ స్పందిస్తారేమో చూడాలి.

Recent

- Advertisment -spot_img