Homeహైదరాబాద్latest Newsత్వరలో ఆసరా పింఛన్​ పెంపు? సీఎం రేవంత్​ ఆదేశాలు

త్వరలో ఆసరా పింఛన్​ పెంపు? సీఎం రేవంత్​ ఆదేశాలు

ఆసరా పింఛన్లు ఎప్పుడెప్పుడు పెంచుతారా? అని లబ్ధిదారులు వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్​లోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు హామీ నెరవేర్చలేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే పింఛన్​ పెంచకపోతే కచ్చితంగా ఆ ఎఫెక్ట్​ వచ్చే పార్లమెంటు ఎన్నికల మీద ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే పింఛన్​ పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు తాజాగా రేవంత్​ రెడ్డి.. అధికారులతో ఈ విషయం చర్చించినట్టు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ , మహిళలకు ప్రతినెల రూ. 2500 విడుదల చేయడంపై అనుముల రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టిందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచారం సాగుతుంది.

Recent

- Advertisment -spot_img