ఇదే నిజం, బెల్లంపల్లి: స్కై జిమ్ ఆధ్వర్యంలో మార్చి 3న నిర్వహించినున్న బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆవిష్కరించారు. బెల్లంపల్లిలోని నంబర్ 1 గ్రౌండ్స్ లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందకరవిషయమని చెప్పారు.