సూర్య సిరీస్ తో, తనలోని గ్లోబల్ స్టార్ ని పరిచయం చేసినంతగా బిల్డప్ ఇచ్చిన నటుడు, ఇప్పుడు చేతికి బేడీలు వేసుకునే పనిలో ఉన్నాడు. స్టూడెంట్ సిరీస్ తో ఎక్కడలేని కొత్తదనాన్ని పరిచయం చేసినంత పొంగిపోయిన యాక్టర్, ఇప్పుడు స్టువర్ట్ పురం దొంగలాంటి తనలోని మరో రూపాన్ని బయటపెట్టాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ గా సాఫ్ట్ గా కనిపించిన ఒక కన్నింగ్ స్టార్, ఇప్పుడు గాంజా వ్యవహారాల నడుమ గాలి పీలుస్తూ పట్టుబడ్డాడు. అతగాడే, షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, మంచి లైఫ్ లీడ్ చేస్తున్న ఈ యాక్టర్, మితిమీరిన అహంకార ధోరణితో ఇప్పుడు ఊచలు లెక్కపెట్టడానికి సిద్దమయ్యాడు. షణ్ముఖ్ తో పాటు, అతని సోదరుడు సంపత్ కూడా, ఈ విషయంలో పట్టుబడ్డాడు. సంపత్ అయితే, మరో ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని, మరో యువతిని పెళ్లి చేసుకుని, వాళ్ళ మెంటాలిటీని మరోసారి చాటిచెప్పాడు. ఏదో చిన్న చిన్న సిరీస్ లతో పేరు సంపాదించగానే, తామే తదుపరి మెగా స్టార్ అని పొంగిపోతుంటారు కొందరు సోషల్ మీడియా నటులు.
అదే కోవలోకి చెందిన ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా, తమ అపార్ట్మెంట్ సాక్షిగా ఎన్నో అనివార్యమైన కార్యకలాపాలకు నడుం బిగించారు. తమ్ముడు సంపత్ పెళ్లి వ్యవహారం మీద కేసు నమోదవ్వగా, విచారణ కోసం వెళ్లిన పోలీసులకు, షణ్ముఖ్ గాంజా కొడుతూ పట్టుబడ్డాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా, ఈ నటులు, ఇప్పుడు పోలీసుల కస్టడీలో కలం వెళ్లదీస్తున్నారు. ఒకప్పుడు హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్ చేసిన పిల్ల చేష్టలను ప్రజలు ఇంకా మరచిపోకముందే, ఇప్పుడు మరో తాజా కేసుతో, వార్తల్లో నిలిచారు. ప్రజలపై తమ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఉంటుందని మరచిపోయే ఇలాంటి నటుల వల్ల, అందరి ఆర్టిస్టులకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ, కొందరు వాపోతున్నారు. చెప్పేవి శ్రీ రంగ నీతులు, దూరేవి ఫలానా ప్లేసులు అన్నట్లుగా, వీళ్ళు చేసిన వెబ్ సిరీస్ లో, కొన్ని ఆల్బం సాంగ్స్ లో.. మరో రోమియో మళ్ళీ పుట్టదా, దేవదాసే మళ్ళీ డెనిమ్ జీన్స్ లో వచ్చాడా అన్నట్టు తమ యాక్టింగ్ ని ఒలకపోస్తారు, కానీ, నిత్య జీవితంలో మాత్రం వీళ్ళ అసలు రూపం ఇలా ఉంటుందా అంటూ, షణ్ముఖ్ ని ఫాలో అయ్యేవాళ్ళు నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వాళ్ళను సమాజం ఎంత యాక్సెప్ట్ చేసిన కూడా, పోలీసులు మాత్రం వదిలేది లేదు అని భీష్మించుకు కూర్చున్నారు. ఈ అన్నదమ్ముల వ్యవహారం మీద పోలీసులు మరింత ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.