ఇదే నిజం, ఏపీ బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశాలపై కొన్ని రోజులుగా రెండు పార్టీల నేతల, అధినేతల మధ్య చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చర్చలు తాజాగా ఓ కొలిక్కి వచ్చాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో అన్న అంశంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వారు సంయుక్తంగా తమ కూటమి తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, అముదాలవలస నుంచి కూన రవికుమార్ పోటీ చేయనున్నట్లు వారు వెల్లడించారు.
వారితో పాటు తెదేపా అభ్యర్థుల జాబితా..
ఇచ్ఛాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
ఆమదాలవలస – కూన రవికుమార్
రాజాం – కోండ్రు మురళి
గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – ఆదితి గజపతిరాజు
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు,
తుని – యనమల దివ్య
పి.గన్నవరం – రాజేశ్ కుమార్
కొత్తపేట – బండారు సత్యానంద రావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
జగ్గం పేట – వెంకట అప్పారావు
ఆచంట – సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు