Homeహైదరాబాద్latest Newsఅల్ఫోర్స్ లో ఘనంగా వీడ్కోలు సమావేశం

అల్ఫోర్స్ లో ఘనంగా వీడ్కోలు సమావేశం

ఇదేనిజం, కరీంనగర్: కరీంనగర్ లోని అల్ఫోర్స్ జెన్ నెక్స్ట్ పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. శనివారం వావిలాల పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ, 9వ తరగతి విద్యార్థులకు పదో తరగతిలో స్వాగతం పలుకుతూ “అతిసర్గ్-2024” పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులకు తన అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు జీవితాన్ని నేర్చుకోవాలని ఉద్బోధించారు. విద్యార్థి విద్యా దశలో పదవ తరగతి అత్యంత కీలకమని, కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని సూచించారు. విద్యతోనే సమాజంలో విలువ ఉంటుందని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు అయ్యేవరకు ఒక దీక్షలా స్టడీస్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img