ఇదే నిజం, కోరుట్ల అర్బన్: కోరుట్ల పట్టణంలో ప్రజాపాలనకు సంబంధించిన మూడు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం, స్వశక్తి మహిళా భవనం, పాత మున్సిపల్ కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి, వంటి పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఈ కేంద్రాల్లో పరిష్కరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి కోరారు.