రాజమౌళీ సినిమా అంటే ప్రీప్రొడక్షన్ పనులే ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ డీటైల్డ్‌గా రీసెర్చ్ చేసి, పాత్ర స్కెచ్‌లే కాదు, వాళ్లు వాడే ఆయుధాల స్కెచ్‌లూ, వాళ్ల కాస్టూమ్స్‌కి సంబంధించిన స్కెచ్‌లూ, స్టోరీ బోర్డ్.. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని, అన్ని అనుమానాలనూ నివృత్తి చేసుకొని పూర్తి క్లారిటీతో రంగంలోకి దిగుతారు రాజమౌళి. ప్రస్తుతం మహేశ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ చకచకా సాగుతున్నది. అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రెజర్ హంట్ మూవీగా ఈ చిత్రాన్ని రాజమౌళీ తెరకెక్కిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారతీయ సినిమా చూడని కొత్త ప్రపంచాన్ని రాజమౌళీ ఆవిష్కరించబోతున్నారని ఇటీవలే విజయేంద్రప్రసాద్ మీడియాతో చెప్పారు. ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని కొత్త లుక్‌లో ఇందులో మహేశ్ కనిపించనున్నారట. ఈ లుక్‌కి సంబంధించిన ఎనిమిది స్కెచ్లను రాజమౌళీ సిద్ధం చేశారట. ఆ లుక్స్‌తో త్వరలో మహేశ్‌కి టెస్ట్ ఫొటో షూట్ చేయనున్నారని తెలిసింది. అందులో ఒక లుక్‌ని ఖరారు చేస్తారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను రాజమౌళీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటిస్తుంటారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ని ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.