ఇదేనిజం, అనంతగిరి,సూర్యాపేట : మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు ప్రతిరోజు మిరప తోట వేరడానికి కులీ పనికి నేలకొండపల్లి పోతుంటారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల సమయం కిష్టాపురం నుంచి బయలుదేరి వెళ్తుండగా మార్గం మధ్యలో నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం వద్ద ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.మృతురాలి పెద్దపొంగు పార్వతమ్మ వయసు 45 సంవత్సరాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.