Homeహైదరాబాద్latest Newsమైనర్​పై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

మైనర్​పై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

ఇదేనిజం, జగిత్యాల టౌన్ : గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొడిమ్యాల హరికృష్ణ అలియాస్ హరీశ్​ గ్రామంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. నిత్యావసర సరుకులు కోసం దుకాణానికి ఒంటరిగా వచ్చే బాలికలను టార్గెట్​గా చేసి, బాలికలకు తన సెల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమని చెప్పి మెల్లగా దగ్గరికి వచ్చి సెల్​ఫోన్​లో బూతు వీడియోలు బొమ్మలను బాలికలకు చూపెడుతూ వారిపై లైంగిక దాడి చేసేవాడు. బాలికలను బెదిరించి బైక్​పై ఎక్కించుకొని బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేవాడు. దీని గురించి ఇంట్లో చెబితే పోలీసులు వస్తారు.. మీ పరువు పోతుందని భయభ్రాంతులకు గురిచేసి ఎవరికి చెప్పకుండ చేసేవాడు. ఈ విధంగా గ్రామంలోని ముగ్గురు బాలికలపై హరికృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హరికృష్ణ చేస్తున్న వికృతి చేష్టలను గమనించి బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో ముగ్గురు బాలికల తల్లులు 2022 ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా, బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.3లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.

Recent

- Advertisment -spot_img