Kumuram Bheem Asifabad District Latest News
ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని వాంకిడి పోలీస్ స్టేషన్ వద్ద సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 1.30 లక్షలు పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర కు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరాబాద్ కు వెళ్తున్నట్లు తెలిపారు. నగదును సీజ్ చేసినట్లు ఎస్సై సాగర్ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో వాంకిడి ఎస్సై సాగర్ , ఏఎస్సైలు పోషెట్టి, ఉల్లాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.