ఏపీ ఎన్నికల రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల చివరి జాబితా ప్రకటించడంతో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీకొట్టనున్నారు. బొత్సపై పోటీకి సీనియర్ అయిన కళానే బెటర్ అని తెలుగుదేశం పార్టీ భావించింది.
అయితే బొత్స చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు కంచుకోటగా చీపురుపల్లి ఉంది. కళా వెంకటరావు నాలుగు సార్లు ఉణుకూరు నియోజకవర్గం నుంచి, 2014లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గా గెలిచారు. ఈ సారి ఎచ్చెర్ల సీటు భారత జనతా పార్టీకి కేటాయించడంతో కళా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు.