ప్రజలను చైతన్యవంతులను చేయడంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముందుంటారు. తాజాగా క్రికెట్ అభిమానులకు ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు. హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారని వెల్లడించారు. టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇన్‌స్టా రీల్స్, స్టోరీలు, యూట్యూబ్ షార్ట్స్‌లో ఫేక్ లింక్‌లను పోస్టు చేస్తున్నారని తెలిపారు. ఈలింకులపై క్లిక్ చేయద్దని పేర్కొన్నారు.