Homeహైదరాబాద్latest Newsరాజమండ్రికి రామ్ చరణ్.. ఎందుకంటే?

రాజమండ్రికి రామ్ చరణ్.. ఎందుకంటే?

శంకర్‌ దర్శకత్వంలో, రామ్‌చరణ్‌ హీరోగా, కియారా అడ్వాణీ కథానాయిక గా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్ ఎంటర్టైనర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది.

ఈ నెల మూడో వారం నుంచి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కొద్దిరోజులు అక్కడ చిత్రీకరణ చేసుకున్నాక విశాఖపట్టణంలోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ షెడ్యూల్‌ దాదాపు పది రోజులకు పైగా ఉండనున్నట్లు సమాచారం. ఇందులో చరణ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.

Recent

- Advertisment -spot_img