Homeహైదరాబాద్latest Newsనేడు రంజాన్ పండగ

నేడు రంజాన్ పండగ

దేశంలోని అనేక ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించింది. ఈ రోజు ఈద్ పండగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. కేరళ, కాశ్మీర్, లడఖ్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈద్ బుధవారం జరుపుకోగా… ఇతర రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రం చంద్రుడు కనిపించాడు. దీంతో ఈద్ పండుగను మిగిలిన రాష్ట్రాల్లో నేడు ( గురువారం) జరుపుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ తర్వాత షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఈద్ రోజు ఉదయం ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ముస్లింలు ఉదయాన్నే కొత్త బట్టలు ధరించి, నమాజ్ చేసి శాంతి కోసం ప్రార్థిస్తారు. ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అనంతరం ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ.. వివిధ మార్గాల్లో ఈద్ జరుపుకోవడం ప్రారంభిస్తారు.

Recent

- Advertisment -spot_img