కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. పూరన్(45), కేఎల్ రాహుల్(39) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. అటు కోల్కతా బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా.. వైభవ్, నరైన్, వరుణ్ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో కోల్కతా గెలవాలంటే 162 పరుగులు చేయాల్సి ఉంటుంది.