Homeహైదరాబాద్latest Newsబొల్లారంలో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం

బొల్లారంలో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం

ఇదే నిజం, జిన్నారం: పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావ్ కు మద్దతుగా బీజేపీ బొల్లారం మున్సిపల్ టౌన్ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని వినాయక నగర్ లో ప్రచారం చేసారు. ఈ సందర్బంగా ఆనంద్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీకి ఓటు వేసి మోది కి మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. మేఘన రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, నాయకులు మోహన్ రావ్, మోహిత్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img