Homeహైదరాబాద్latest Newsఅది షర్టా లేదా బ్యాంక్ అనుకున్నావా.. షర్ట్ లో ఎన్ని లక్షలు దాచాడో తెలుసా?

అది షర్టా లేదా బ్యాంక్ అనుకున్నావా.. షర్ట్ లో ఎన్ని లక్షలు దాచాడో తెలుసా?

ఎన్నికల వేళ డబ్బును తరలించడానికి చాలా మంది రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు. ఓ వ్యక్తి ఏకంగా షర్ట్ లోపల డబ్బులు దాచేసుకున్నాడు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి.. తమిళనాడులో ఒక వ్యక్తి తన దుస్తులలో రూ.14 లక్షలను తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. కేరళ-తమిళనాడు సరిహద్దులోని వాలాయార్ చెక్‌పోస్టు వద్ద వినో అనే వ్యక్తి దుస్తులపై అధికారులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా బస్సులో డబ్బులను తరలించాలని అనుకున్నాడు. ఆ వ్యక్తిని బస్సు నుండి దింపి తనిఖీ చేస్తున్నప్పుడు.. అతను తన చొక్కా లోపల నుండి డబ్బుల కట్టలను బయటకు తీశాడు. మోడల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఒక వ్యక్తి కేవలం రూ. 50,000 మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతించబడతాడు. అనుమతించిన మొత్తానికి మించి ఏదైనా డినామినేషన్ తీసుకువెళితే అవసరమైన డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా చూపించాలి. ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img