Homeహైదరాబాద్latest Newsరీ రిలీజ్‌ సిద్ధమైన పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్‌

రీ రిలీజ్‌ సిద్ధమైన పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి రానుండడం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటికి చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తను రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే పవన్ నటించిన `వకీల్ సాబ్ మూడేళ్ళ క్రితం విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. అయితే ముగ్గురు అమ్మాయిలను దుండగులు వేధింపులకు గురిచేసే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఇప్పుడు మే 1న ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి రానుందని కన్ఫర్మ్ అయింది. మరి ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో అంజలి, అనన్య నాగెళ్ల, నివేదా థామస్ కీలక పాత్రలు పోషించారు. అలాగే థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రం తెరకెక్కించారు.

Recent

- Advertisment -spot_img