డబ్బులు తీసుకుంటూ వైసీపీ తరఫున మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారనే వార్తల్లో వాస్తవం లేదని నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి కొట్టిపారేశారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించేందుకు ఏ పరీక్షలకైనా సిద్దమేనని, తాను పెయిడ్ ఆర్టిస్ట్ కాదని వ్యాఖ్యానించారు. నార్కోటెస్ట్, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
“నేను కామన్ మ్యాన్. ప్రజల్లో ఒకడిని. ఎవరి మీదా నాకు దురుద్దేశం లేదు. మంచిపనీ చేస్తే పొగుడుతా. అన్యాయం చేస్తే ఎదురిస్తా. అవసరముంటే, పిఠాపురంలో వైసీపీ తరఫున ప్రచారం చేస్తా. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరు బెస్ట్‌గా ఉంటారో వాళ్లకే సపోర్ట్ చేస్తా.
– పోసాని కృష్ణమురళి