పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ‘తెలంగాణ మేనిఫెస్టో’ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.