Homeహైదరాబాద్latest News‘చింతపండు’ మాకొద్దు.. తీన్మార్ మల్లన్నకు ఎదురుగాలి

‘చింతపండు’ మాకొద్దు.. తీన్మార్ మల్లన్నకు ఎదురుగాలి

ఇదేనిజం, తెలంగాణ: చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. గతంలో ఆయన సొంత యూట్యూబ్ చానల్ లో చేసిన అసందర్భ ప్రేలాపన ఇప్పుడు కొంపముంచుతున్నట్టు కనిపిస్తోంది. క్యూన్యూస్ చానల్ ద్వారా చింతపండు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు.. నచ్చని వాళ్లని.. తనకు పడని వాళ్లను ఆయన టార్గెట్ చేసేవారు. ఆ పార్టీ ఈపార్టీ అని తేడా లేకుండా నోటికొచ్చిన ఆరోపణలు గుప్పించేవాడు. ఇష్టారాజ్యంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చారు. మల్లన్న బాధితుల్లో అన్ని పార్టీల లీడర్లు ఉన్నారు. అందులో కాంగ్రెస్ లీడర్లూ ఉన్నారు. ఇప్పుడు ఈ చింతపండు ఎమ్మెల్సీగా గెలవాలంటే సదరు లీడర్ల సపోర్ట్ ఎంతో అవసరం మరి వారంతా సపోర్ట్ చేస్తారా? అంటే కచ్చితంగా చేయరనే చెప్పాలి.

టికెట్ దక్కింది కానీ..
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తీన్మార్ మల్లన్నకు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ కేడర్ నుంచి సపోర్ట్ దక్కడం లేదు. మల్లన్న తన యూట్యూబ్ చానల్ ద్వారా ఎందరో రాజకీయనేతలను టార్గెట్ చేశాడు. వారి వ్యక్తిగత జీవితాల మీద ఆరోపణలు చేశాడు. అనేక నిరాధార ఆరోపణలతో సదరు లీడర్లను ఇరుకున పెట్టాడు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు మల్లన్న గెలవాలంటే సదరు లీడర్ల సపోర్ట్ కావాల్సిందే. కానీ వారంతా పాత విషయాలను మనసులో పెట్టుకొని మల్లన్నకు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.

కోవర్టులంటూ ఆరోపణలు
తన క్యూన్యూస్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చింతపండు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆయన బీఆర్ఎస్ కు కోవర్టు అని.. మైహోం అధినేతకు బినామీ అని.. ఇలా రాజకీయంగా, వ్యక్తిగతంగా అనరాని మాటలతో ఉత్తమ్ మీద నోరు పారేసుకున్నాడు మల్లన్న. ఈవిషయం మీద నేరుగా ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.. అప్పట్లో రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే తీన్మార్ మల్లన్న ఈ రకంగా ఆరోపణలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇక మరో లీడర్ కోమటిరెడ్డిని వదిలిపెట్టలేదు చింతపండు. ఆయన మీద సైతం వ్యక్తిగత దూషణకు దిగాడు. ఓ దశలో అన్ని పార్టీల లీడర్లకు మల్లన్నకు భయపడే పరిస్థితి ఉండేది. కేవలం విమర్శలు చేయకుండా ఉండేందుకు కూడా మల్లన్న కొందరు లీడర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు మల్లన్న నల్లగొండను వదిలేసి ప్రచారంలో ముందుకు సాగగలరా? ఒకవేళ నల్లగొండలో అడుగు పెట్టాలంటే ఉత్తమ్, కోమటిరెడ్డి సపోర్ట్ లేకుండా మల్లన్న ప్రచారం చేయడం కూడా కష్టమే. అందుకే ఆయనకు సొంతపార్టీలోనే ఎదురీత కనిపిస్తోంది.

కోదండరామ్ నూ వదలలేదు..
ఇక గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కూడా తలపడ్డారు. ఆ సమయంలో మల్లన్న రెచ్చిపోయాడు. కోదండరామ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తనకు కేటాయించిన అసెంబ్లీ టికెట్లు మొత్తం అమ్ముకున్నాడని ఆరోపించారు. మరి ఇప్పుడు కోదండరామ్ అనుచరులు, తెలంగాణ ఉద్యమకారులు సపోర్ట్ చేయకపోగా వ్యతిరేక ప్రచారం చేసే చాన్స్ ఉంది. జనగామ, సిద్దిపేట టికెట్లు ఇంత ధరకు అమ్ముకున్నాడని కూడా ఆరోపణలు చేశాడు మల్లన్న. దీంతో ఉద్యమకారులు, కాంగ్రెస్ శ్రేణులు,లీడర్లు, మల్లన్న విషయంలో గుర్రుగా ఉన్నారు. బీసీ కార్డు పనిచేస్తుందని మల్లన్నకు ఈ టికెట్ ఇచ్చారు. మరోవైపు నల్లగొండ జిల్లాకుచెందిన ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి చెక్ పెట్టేందుకు ఇలా టికెట్ ఇచ్చాడా? అన్న డౌట్స్ వస్తున్నాయి. మరి మల్లన్న గెలుస్తాడా? ఆయన వ్యతిరేకులు గెలవనిస్తారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img