ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ హెడ్ SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియా రప్పించేందుకు కార్యచరణ మొదలైంది. అమెరికాలో ఉన్న ఆయనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు ప్రభాకర్ రావు గతంలో ఓ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.
అవినీతిపరులు, క్రిమినల్స్‌ను ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తించేందుకు, ఆయా దేశాల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సహాయాన్ని కోరేందుకు INTERPOLE సాయంతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. నిందితుడిని గుర్తించి అప్పగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియాలో సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తుంది.