నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను అగ్ర నిర్మాణ సంస్థ కేవిన్ ప్రోడక్షన్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. కానీ ఎంత ధర అనేది వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని జూన్ 27న కర్ణాటకలో గ్రాండ్ గా తమ నుంచి విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి కేజీఎఫ్ స్టార్ యష్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “టాక్సిక్” మూవీని తెరకెక్కిస్తున్నారు.