తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్ష ఆగస్టులో జరుగుతుంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ నియామకాల అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష ఉంటుంది. మే 14 నుంచి జులై 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.