ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఓ కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. హైవేపై అల్లాభక్ష్పూర్ టోల్ ప్లాజా సమీపంలో.. కారు అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలివైపుకు చేరుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.