రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను సీఎం జగన్ కలిశారు. ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా సాధిస్తాం. ప్రశాంత్ కిశోర్ ఊహించనన్ని సీట్లు గెలుస్తాం. జూన్ 4 తర్వాత దేశం మొత్తం షాక్ అవుతుంది.’ అని అన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని ప్రశాంత్ కిశోర్ ఇదివరకే చెప్పారు. ఓటమి భయంతోనే జగన్ ఆయన దగ్గరకు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది.