టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మరెవరికీ కనిపించనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘‘స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికిన తర్వాత చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించను. సుదీర్ఘమైన విరామం తీసుకుంటా’’ అని తెలిపాడు.