ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్‌కు తమతో సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. మీడియాలో వస్తోన్న వదంతులు అవాస్తవమిని స్పష్టం చేసింది. హమాస్ మిలిటెంట్లకు రైసీ సహాయం చేశారు. అదేవిధంగా స్వతంత్ర పాలస్తీనా పోరాటానికీ ఆయన మద్దతు తెలిపారు. ఈ కారణాల వల్ల ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య గత కొంతకాలంగా దాడులు జరుగుతున్నాయి.
ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని మోదీతో పాటు పలుదేశాల ప్రతినిధులు సంతాపం తెలిపారు.