తెలంగాణ ఎడ్సెట్ హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 23న జరగనున్న ఎడ్సెట్ హాల్ టికెట్లు సోమవారం విడుదల చేశారు. https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మ. 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సా. 4 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.