జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్ల ప్రకటన కూడా అయిపోయింది. చివరి ఛాన్స్‌గా ఏమైనా మార్పులు ఉంటే ఈ నెల 25 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విండీస్ ఆల్ రౌండర్ రసెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సునీల్ నరైన్‌ను ప్రపంచకప్‌లో ఆడాల్సిందిగా కోరాడు.
‘‘ఐపీఎల్లో నరైన్ ప్రదర్శన చూసిన తర్వాతే.. చాలా సంతోషించా. గత సీజన్లలో అతడిని 9 లేదా 10వ స్థానంలో ఆడించాం. అక్కడ అతడి అవసరం పెద్దగా లేదు. ఈసారి ఓపెనర్‌గా తనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఓ బౌలర్ దాదాపు 500 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. ఇటు బౌలింగ్‌లోనూ 16 వికెట్లనూ పడగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ నిర్ణయం వల్లే అతడికి ప్రమోషన్ లభించింది.
ఈ స్థాయి ఫామ్‌లో ఉన్న నరైన్‌ను టీ20 ప్రపంచ కప్‌లోనూ చూడాలనేది నా కోరిక. గతంలో మా జట్టును ప్రకటించే సమయంలోనూ చాలా చెప్పి చూశా. దాదాపు రెండు వారాలపాటు అతడితో మాట్లాడుతూనే ఉన్నాం. ‘ప్లీజ్.. ఈ వరల్డ్ కప్‌లో ఆడు. ఆ తర్వాత నువ్వు రిటైర్ అయినా ఫర్వాలేదు. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు’ అని విజ్ఞప్తి చేశాం. అప్పటికే అతడు ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. దానిని మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా మార్చుకొని ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్ మొత్తం ఆనందిస్తుంది’’ అని రస్సెల్ వ్యాఖ్యానించాడు. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.