ఆడవారికి శృంగార కోరికలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయో నిపుణులు తేల్చి చెప్పేశారు. వాస్తవానికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోనల్లలో మార్పులు సెక్స్ పరమైన కోరికల్లో కీలకపాత్ర వహిస్తాయి. అయితే స్త్రీలలో అండోత్సర్గము సమయంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ బాగా పెరుగుతాయట. దీనివల్ల వారిలో పీరియడ్స్ తర్వాత శృంగార పరమైన కోరికలు ఎక్కువగా కలుగుతాయి. పురుషుల విషయానికి వస్తే టెస్టో స్టెరాన్ అనే హార్మోన్ పెరగడంవల్ల లిబిడో బాగా పెరుగుతుంది. అయితే హార్మోన్లలో సమతుల్యత లోపించడం కారణంగా కొందరు యుక్త వయస్కులై వారిలో లైంగిక పరమైన సమస్యలు సంభవించవచ్చు. కానీ 27 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో ఈ అవకాశం చాలా తక్కువ. అందుకే వీరు యువతులకంటే కూడా లైంగిక పరమైన ఆలోచనలు, కోరికలను ఎక్కువగా కలిగి ఉంటారని ఒక అధ్యయనం పేర్కొన్నది. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్, ఒత్తిడిలేని జీవన విధానం, భార్యా భర్తల మధ్య మంచి అనుబంధం వంటివి కూడా లైంగిక కోరికలు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.