Homeలైఫ్‌స్టైల్‌Belly fat : నడుం చుట్టూ కొవ్వు, పొట్ట తగ్గును ఇలా...

Belly fat : నడుం చుట్టూ కొవ్వు, పొట్ట తగ్గును ఇలా…

Belly fat .. Fat near the stomach .. Source of many diseases. This problem plagues many. No matter how many exercises you do, the result will not be the same. Enough to eat junk food .. All the fat will reach the stomach. This makes it look gorgeous. Several studies have now concluded that the corona is linked to obesity. So it is now mandatory to melt the fat around the stomach.

బెల్లీ ఫ్యాట్‌.. పొట్ట దగ్గర కొవ్వు.. ఎన్నో రోగాలకు మూలం. ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా ఫలితం ఉండదు. జంక్‌ఫుడ్‌ తింటే చాలు.. ఆ కొవ్వంతా పొట్టదగ్గర చేరిపోతుంది. దీంతో అందవికారంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం కరోనాకు ఊబకాయానికి లింక్‌ ఉందని పలు అధ్యయనాలు కూడా తేల్చాయి. కనుక పొట్టచుట్టూ కొవ్వును కరిగించుకోవడం ఇప్పుడు తప్పనిసరి. మరి దీనికి పరిష్కారమేంటి అని ఆలోచిస్తున్నారా?.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే నాలుగు రకాల ఆహార పదార్ధాలను నిపుణులు సూచించారు. వీటిని కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు.

1.పెసర్లు..

బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించి, అధిక బరువును తగ్గించడంలో పెసర్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్‌ ఏ, బీ, సీ,ఈతోపాటు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. నిత్యం ఒక కప్పు పెసర్లను ఉడకబెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.

2.వాము

అధిక బరువును తగ్గించుకునేందుకు వాము బాగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్‌ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ వాము వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్చార్చి రోజులో కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు వేగంగా కరుగుతుంది.

3. సబ్జా గింజలు..

బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్‌ ఏ,ఈ,కే,బీలు ఉంటాయి.అలాగే, డైటరీ ఫైబర్‌, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. తద్వారా అధిక బరువును తగ్గిస్తాయి.

4.గోధుమ రవ్వ ఉప్మా..

చాలామంది ఇష్టంగా తినే గోధుమ రవ్వ ఉప్మాకు అధిక బరువును తగ్గించే విశేష గుణముంది. దీన్ని రోజులో ఏదో ఒక పూట తినాలి. నిత్యం తీసుకునే ఆహారానికి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌ శరీరానికి ఎంత అవసరమో అంతే ఉంటాయి. దీంతో బరువు పెరగరు.

Recent

- Advertisment -spot_img