తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు బ్రాంకోస్కోపీ ద్వారా అరుదైన చికిత్స చేశారు. 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తులో 4 సెం.మీ సూదిని ఎలాంటి ఆపరేషన్ లేకుండా బయటికి తీశారు. కేవలం మూడున్నర నిమిషాల్లోనే విజయవంతంగా చికిత్స చేశారు. ఈ ప్రక్రియను రికార్డు చేశారు. దుస్తులు వేసుకుంటుండగా బాలిక నోటి ద్వారా సూది ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు.
బ్రాంకోస్కోపీ ద్వారా ఓ సన్నని గొట్టానికి కెమెరాను బిగించి శ్వాసనాళంలోకి పంపి చికిత్స చేస్తారు.